calender_icon.png 21 January, 2026 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి

21-01-2026 12:00:00 AM

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన విప్

కోనరావుపేట జనవరి 20 (విజయ కాంతి):పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిన కానీ ఇందిరమ్మ రాజ్యంలో గత ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక్క పథకాన్ని కూడ రద్దు చేయకుండా నూతన పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు..

గత పది సం వత్సరాల్లో పది రేషన్ కార్డులు కూడ ఇవ్వలేదన్నారు.. తెలంగాణా వ్యాప్తంగా రేషన్ కార్డులు లేని వారికి కార్డులు ఇస్తూ వెంటనే 6 కిలోలో సన్నం బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 61 వేల నూతన రేషన్ కార్డులు మంజూరు,27 లక్షల 83 వేల అదునపు ఇంటి సభ్యులను రేషన్ కార్డుల్లో నమోదు చేసినట్లు తెలిపారు..నిరుపేదలకు పక్క ఇంటి నిర్మాణం కోసం వారి స్వంత ఇంటి కలను సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు..పేద ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయడం జరు గుతుందన్నారు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్మాణం కోసం 200 కొట్లు ప్రభుత్వం మంజూరు చేశారని పేర్కొ న్నారు..రాష్ట్రంలోని ఎస్సి, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సైతం ఇంటర్నేషనల్ స్థాయిలో విద్య అందిస్తున్నామన్నారు.కోనరావుపేట మండలంలో త్వరలోనే 35 ఎకరాల్లో ఒక ప్రభుత్వ పరంగా అభివృద్ధి కి శ్రీకారం చుడతామని తెలిపారు..మండల పరిధిలోని ప్రభుత్వ భూముల సర్వే చేసి విస్తీర్ణం పై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, తాసిల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో స్నిగ్ధ, పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, సర్పంచులు, ఉపసర్పంచ్లు, నాయకులు,కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు