calender_icon.png 11 August, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం వెంటనే ఆపాలి

11-08-2025 03:12:05 PM

  1. ఎస్సారెస్పీ కాల్వ ల ద్వారా కాళేశ్వరం నీళ్లు తుంగతుర్తి కి ఇవ్వాలి.
  2. తుంగతుర్తిలో బిఆర్ఎస్ శ్రేణుల నిరాహార దీక్ష
  3. బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య

తుంగతుర్తి (విజయ క్రాంతి): బనక చర్ల ప్రాజెక్టు(Banakacharla project) నిర్మాణ పనులు ప్రభుత్వం వెంటనే ఆపాలని కాళేశ్వరం వద్ద కన్నెపల్లి మోటార్లను నడిపి పారుతున్న గోదావరి నీళ్లను ఎస్సారెస్పీ కాలువల ద్వారా తుంగతుర్తి కి ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లోగోదావరి పై అక్రమంగా నిర్మిస్తున్నబనకచర్లప్రాజెక్ట్ ను వెంటనే ఆపే విధంగా కేంద్ర.. రాష్ట్ర.. ప్రభుత్వాలు చెర్యలు చేపట్టి.. కృష్ణ.. గోదావరి.. జలాల్లో తెలంగాణ వాటాను కాపాడాలి. తుంగతుర్తి ప్రాంతం లో సకాలంలో సరియైన వర్షాలు కురువక పోవడంతో చెరువులు.. కుంటలు. పూర్తిస్థాయిలో నిండ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భూగర్భ జలాలు అడుగంటి పోయి రైతంగాం ఇబ్బందులకు గురి అవుతున్నారని తక్షణమే రైతుల ప్రయోజనాల దుష్ట ఎస్సారెస్పీ జలాలు తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో మండల నాయకులు దొంగరి శ్రీనివాస్. తునికి సాయిలు కడారి దాసు. మట్టిపెల్లి వెంకట్. గోపగాని రమేష్. దూదిగాని లింగయ్య. బర్ల సోమన్న. గాజుల యాదగిరి. బూక్య ధర్మ. యాకూ నాయక్. దశరద నాయక్.. పూర్ణ నాయక్. కొండగడుపుల నాగయ్య.తునికి లక్ష్మి బోయిని భాస్కర్... గోపగాని వెంకన్న శంకర్ నాయక్.. కళ్యాణ్.. పోలేపాక పరమేష్.. కేశవరెడ్డి.. తూం బిక్షం. అకారపు భాస్కర్.. జటంగి రవి. వెంకట్ నర్సు.. చింతకుంట్ల సురేష్. మనోజ్. షేక్ జూనీ..తో పాటు అన్ని గ్రామాల నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు