11-08-2025 03:14:33 PM
మాజీ మున్సిపల్ వైస్ చెర్మన్ కోతి సంపత్ రెడ్డి
హుజూర్ నగర్: మానవ మనుగడకు మొక్కలే ఆధారమని హుజూర్ నగర్(Huzur Nagar) మాజీ మున్సిపల్ వైస్ చెర్మన్ కోతి సంపత్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని మూడవవార్డు లో ఇంటి ఇంటికి మొక్కలు పంపిణి చేసి మాట్లాడారు...వాతావరణ కాలుష్యంతో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో మొక్కలు విరివిగా పెంచడమే ఆధారమన్నారు.ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతి ఇంటికి ఒక మొక్కని నాటి భవిష్యత్తు తరాలకు పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ అశోక్,ఆర్ పి మంజుల,మున్సిపల్ సిబ్బంది విజయ్, వెంకటేశ్వర్లు,వార్డు ప్రజలు,పాల్గొన్నారు.