30 June, 2026 | 11:55 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఒద్దిపేట చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టాలి

16-05-2025 12:00 AM

ఇది చర్ల మండల రైతుల ఆకాంక్ష 

చర్ల, మే 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో గల వద్దపేట చెక్ డ్యాం నిర్మాణం చేపట్టాలని అఖిల భారత రైతు సంఘం మండల అధ్యక్షులు సొంది నా రాయణ డిమాండ్ చేశారు. గురువారం  స్థానిక సిపిఎం కార్యాలయం లో తెలంగాణ రైతు సంఘం చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మా ట్లాడారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1999 - 2004 మధ్యకాలంలోనూ అలాగే 2014 -18 మధ్యకాలంలో సిపిఎం పార్టీ నుండి భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన స్వర్గీయ సున్నం రాజయ్య అసెంబ్లీలో ఒద్దిపేట చెక్ డ్యాం నిర్మాణం చర్ల మండల రైతుల ఆకాంక్ష అని, చెక్ డ్యాం నిర్మాణం జరిగితే వేల ఎకరాల సాగు భూమికి నీరందుతుందని దానివలన రైతుల కళ్ళలో ఆనందం, జీవితంలో వెలుగు నింపవచ్చని పలుమార్లు తన గళం వినిపించడం జరిగిందని గుర్తు చేశారు.

సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దుమ్ముగూడెం నుండి సుబ్బంపేట వరకు వాటర్ స్టోరేజ్ ఉంటుందని, చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టును అనుసంధానం చేసి వద్దిపేట చెక్ డ్యాం నిర్మాణం చేపడితే చర్ల మండలంలో సుమారుగా 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎన్నికల సమయంలో చెక్ డ్యాం నిర్మాణం ఎన్ని కల ప్రచారహస్త్రం గానే మిగిలిందన్నారు.

నిర్మాణం మాత్రం చేపట్టడం లేదని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని చర్ల మండలంలోని ఒద్దిపేట చెక్ డ్యాం నిర్మాణం చేపట్టి రైతులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు.  చెక్ డ్యాం నిర్మాణం చేపట్టకపోతే తెలం గాణ రైతు సంఘం ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం చర్ల మండల కమిటీ సెక్రెటరీ మచ్చా రామారావు, సభ్యులు శ్యామల వెంకటేశ్వర్లు, మల్లారపు నరసయ్య, శ్యామల కాంతయ్య, విస్సంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.