30 June, 2026 | 11:05 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో చోరీ

16-05-2025 12:00 AM

అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంఘటన

అబ్దుల్లాపూర్‌మెట్,మే 15: శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో చోరీ జరిగిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మె ట్ మండలం బలిజగూడ గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామి ఆలయం ఉంది. సజ్జల భూషన్ ఆలయలో పూజారి పనిచేస్తున్నాడు.

బుధవారం సాయంత్రం 6:30 గంటలకు పూజ పూర్తి చేసి.. ఆలయానికి తాళం చేసి అతను ఇంటి వెళ్లాడు. గురువారం తెల్లవారుజాము న ఇదే గ్రామానికి చెందిన మెరుగు నర్సిం హా ఆయల తలుపులు తెరిచి ఉండడం గమనించి.. పూజారికి ఫోన్ చేసి దేవాలయం తలుపులు తెరిచి ఉన్నాయని సమాచారం ఇచ్చాడు.

వెంటనే స్పందించి పూజారి ఆలయం వద్ద వచ్చి.. ఆలయంలోకి వెళ్లి చూడగా.. దేవత బంగారు నూపిటల్, నూపిటల్ దారం, 10 గ్రాముల వెండి ఆభరణాలు కనపించకపోవడంతో.. చోరీకి గురైనట్లు గమనించి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లో పూజారి భూషన్ ఫిర్యాదు చేశాడు. పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ వి. అశోక్ రెడ్డి తెలిపారు.