తాగునీటి సమస్య నివారణ కోసం బోరు బావి తవ్వకం
27-05-2026 01:46 AM
నిజాంసాగర్, మే 26 (విజయకాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు తండా గ్రామపంచాయతీలో తీవ్రమైన త్రాగునీటి సమస్య ఏర్పడడంతో గ్రామ సర్పంచ్ నారాయణ త్రాగునీటి సమస్య నివారణ కోసం మంగళవారం బోరుబావిని తవ్వించారు. డి ఎం ఆర్ బి నిధుల ద్వారా బోరుబావిని తవ్వించి నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి తదితరులు పాల్గొన్నారు.






