13 July, 2026 | 8:18 PM

Breaking News

ప్రభుత్వ భూమి అక్రమించేందుకు ప్రయత్నిస్తే చర్యలు   •   భూముల రీ సర్వేతో భవిష్యత్తులో వివాదాలు ఉండవు   •   జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా కోదాడ వాసి సాయిశర్మ   •   నూలు పురుగుల నివారణకై మాత్రలు పంపిణీ చేసిన చైర్మన్ రాధాకృష్ణ   •   జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి   •   బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు   •   శ్రీ సోమలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   మంథని అభివృద్ధిలో మరో ముందడుగు   •   నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద నర్సింగ్ అభ్యర్థుల ధర్నా మద్దతు తెలిపిన ఆర్. కృష్ణయ్య డిమాండ్   •   చిన్నారుల ఆరోగ్యానికి నులిపురుగుల నివారణే రక్ష   •  

అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు

01-04-2026 12:00 AM

పది అడుగుల రోడ్డు... ఐదు అంతస్థుల భారీ అక్రమ నిర్మాణం

టౌన్ ప్లానింగ్ అండతోనే అంటూ స్థానికుల ఆరోపణలు

అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేసినా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్న దుస్థితి

చర్యలు తీసుకుంటాం ఏసీపీ ప్రసీద

కుత్బుల్లాపూర్, మార్చి 31(విజయక్రాంతి): నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని అ క్రమార్కులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా బహుళ అంతస్థులు నిర్మిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బండారి లేఅవుట్‌లో ఓ నిర్మాణదారుడు ఎలాంటి అనుమతులు లేకుండా భారీ భవన నిర్మాణానికి తెరలేపాడు. దాదాపు 50 గజాల స్థలంలో పది అడుగుల రోడ్డులో భారీ భవనం నిర్మిస్తున్నాడు. ఈ అక్రమ నిర్మాణం వల్ల స్థానికు లకు ప్రమా దం పొంచి ఉంది.అయినా సరే పట్టించుకోకుండా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాడు.

టౌన్ ప్లానింగ్ అండతోనే..

అయితే భారీ అక్రమ నిర్మాణానికి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అండ సంపూర్ణంగా ఉందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడుతూ అందినకాడికి దండుకుంటూ అక్రమ నిర్మాణదారులకు టౌన్ ప్లానింగ్ అధికారులు కొమ్ముకాస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు లు చేసిన సరే సదరు నిర్మాణాలకు నోటీసులు జారిచేసి చేతులు దులుపుకుంటున్నా రు. తర్వాత మళ్ళీ యధావిధిగా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నా యి. ఇప్పటికైనా అధికారులు స్పందిం చి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని, నిర్మాణదారులపై క్రిమినల్  కేసులు నమో దు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

నిజాంపేట్ సర్కిల్ ఏసీపీ ప్రసీద

అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న భారీ అక్రమ నిర్మాణంపై ఏసీపీ ప్రసీదని వివరణ కోరగా పరిశీలించి నోటీసులు ఇస్తామని తెలిపారు. నోటీసుల సమయం పూర్త య్యాక కూల్చివేతలు జరుగుతాయన్నారు.