ఆక్రమణల గుప్పిట్లో ఎల్లమ్మ చెరువు
హైడ్రాతో సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలి
తక్షణమే సుందరీకరించాలని బీఆర్‌ఎస్ నాయకుల డిమాండ్
మణికొండ, మార్చి 31 (విజయక్రాంతి): సర్వే నంబర్ 215లో ఉన్న చారిత్రక ఎల్లమ్మ చెరువును బిల్డర్ల ఆక్రమణల నుంచి కాపాడాలని బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బఫర్ జోన్ స్థలాలు ఆక్రమణలకు గురై జలాశయం కుంచించుకుపోతోందని, వెంటనే హైడ్రా అధికారులు స్పందించి సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఆక్రమణలను అరి కట్టి, ప్రభుత్వ స్థలాలను కాపాడుతూ సుందరీకరణ పనులు చేపట్టకపోతే చెరువు ఏక మొత్తంగా అన్యాక్రాంతమవుతుందని వారు హెచ్చరించారు.
సంబంధిత యం త్రాంగం తక్షణమే స్పందించి చెరువును పరిరక్షించాలని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ తల పెట్టిన ‘ప్రజలతో ప్రజల కోసం’ కార్యక్రమంలో భాగంగా నాయకులు ల్యాంకో హిల్స్ సమీపంలోని ఎల్లమ్మ చెరువును పరిశీలించి స్థానికుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ప్రకృతి సిద్ధమైన గురుత్వాకర్ష ణ శక్తితో దుర్గం చెరువు, మల్కం చెరువు, ఖాజాగూడా చెరువు, ఎల్లమ్మ చెరువు, బుల్కాపూర్ నాలా, పందెం వాగు, ఇబ్రా హీం బాగ్ల గుండా మూసీ నదిలోకి జల ప్రవాహం గొలుసుకట్టు విధానంగా సాగేదని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు.
ఒకప్పుడు 22 ఎకరాల 26 గుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు ఇప్పుడు కుంచించు కుపోయిందని, గతంలో ఉన్న ఏడు వ్యవసాయ బావులు పూర్తిగా కనుమరుగయ్యా యని స్థానికులు రామ్ రెడ్డి, రాఘవ రెడ్డి, డీ.లక్ష్మణ్ నాయకుల దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం చెరువు డ్రైనేజీ మురుగు నీటితో నిండి ఉందని, అలుగు కాస్తా మురుగు నీటి పైపుగా మారిపోయిందని వాపోయారు. ప్రజాభీష్టం మేరకు ఈ జలాశయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు సీతా రం ధూళిపాళ, కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, ఉపేంద్రనాథ్ రెడ్డి, అందే లక్ష్మణ్ రావు, సంగం శ్రీకాంత్, యాలాల కిరణ్, భాను చందర్, మహమ్మద్ ఆరిఫ్, విజయ లక్ష్మీ, సుమనళిని, రాజేంద్ర ప్రసాద్, చెరుకూరి బాలాజీ, చంద్రశేఖర్ తదితరులు డిమాండ్ చేశారు.




