18 April, 2026 | 12:25 AM

కోమటిరెడ్డి యువసేన అధ్యక్షునికి పరామర్శ

16-05-2025 01:23 AM

యాదాద్రి భువనగిరి, మే 15 ( విజయ క్రాంతి ):  ఇటీవల భార్యను కోల్పోయిన కోమటిరెడ్డి యువసేన అధ్యక్షులు మెండు భాస్కర్ రెడ్డి ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య తో కలిసి పరామర్శించారు.  భాస్కర్ రెడ్డి సతీమణి మెండు స్వప్న ఇటీవల అనారోగ్యంతో మృతి  చెందింది. 

ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ విప్పుతో కలిసి రాజపేట మండలం బసంతపురం గ్రామానికి వెళ్లి మెండు స్వప్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అన్ని విధాలుగా అండగా ఉంటాం అధైర్య పడొద్దు అని భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు.