18 April, 2026 | 2:00 AM

ఆయిల్‌పాం తోటలను సాగుచేసి అధిక ఆదాయం పొందాలి

16-05-2025 01:20 AM

ఉమ్మడి మండల పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి

 జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మే15: ప్రజా ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఆయిల్ ఫాం తోటల పెంపకంను నీటి వసతి ఉన్న రైతులు సాగుచేసి అధిక ఆదాయం పొందాలని ఉమ్మడి జాజిరెడ్డిగూడెం మండల పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి అన్నారు.

గురువారం మండల పరిధిలోని కొమ్మాల గ్రామంలో ఆయిల్ ఫాం సాగుపై రైతులకు కరపత్రాలతో అవగాహన కల్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ రైతులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు అందించే రాయితీలను సద్వినియోగం చేసుకొని ఆయిల్ ఫాం తోటలను సాగుచేసి అధిక ఆదాయం పొందాలని కోరారు.

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆయిల్ ఫాం తోటల సాగుపైన ప్రత్యేక దృష్టి సారించారని,ఈ పంటలు సాగు చేసినట్లయితే రైతులకు మేలు జరుగుతుందన్నారు.పతంజలి ఆయిల్ ఫాం కంపేని జూనియర్ మేనేజర్ వి శశికుమార్ మాట్లాడుతూ ఆయిల్ ఫాం పంటకు కూలీల ఖర్చు తక్కువని,కోతుల బెడదలేదని అన్నారు. ఆయిల్ ఫాం పంటను ప్రభుత్వం నిర్ణయుంచిన ధరకు కంపెనీ వారే విక్రయిస్తారని అన్నారు.ఈ పతంజలి ఆయిల్ ఫామ్ కంపెనీ  క్షేత్ర సహాయకులు రంగు ముత్యంరాజు,రైతులు పాల్గొన్నారు.