21 August, 2026 | 4:44 PM

Breaking News

నీటి వనరుల వినియోగంపై రైతులను ప్రోత్సహించండి   •   శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •  

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి

21-08-2026 04:03 PM

ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లందు, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ వినియోగదారులు అధికారులను కోరారు. శుక్రవారం ఇల్లందు విద్యుత్ శాఖ ఈఆర్‌ఓ కార్యాలయంలో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సేవా సదస్సులో సీపీఎం జిల్లా నాయకుడు అబ్దుల్ నబీ, మండల కార్యదర్శి ఆలేటి కిరణ్‌కుమార్, మన్యం మోహన్‌రావు తదితరులు పాల్గొని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్పీ బస్తీ గ్రామపంచాయతీలోని దేవులపల్లి యాకయ్యనగర్‌లో గత ఎనిమిదేళ్లుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేద కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు.

21 పిట్ తిలక్‌నగర్ గ్రామపంచాయతీలో విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, లాల్ మహ్మద్ ప్రాంతంలో ఉన్న సింగిల్ వైర్ విద్యుత్ సరఫరాను తొలగించి త్రీ ఫేజ్ విద్యుత్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రస్తుతం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను మార్చి పెద్ద సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని, రోడ్డుకు అవతల ఉన్న ఇళ్లకు విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ స్తంభాలను ఎత్తు పెంచి ఏర్పాటు చేయాలని, దూరంగా ఉన్న ఇళ్లకు కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమస్యలపై స్పందించిన విద్యుత్ సంస్థ కొత్తగూడెం ఎస్‌ఈ, సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సదస్సులో విద్యుత్ శాఖ అధికారులు, పత్రికా ప్రతినిధులు, ప్రజలు, సీపీఎం పార్టీ నాయకులు గడ్డం వెంకన్న, వైకుంఠం, హసీనా తదితరులు పాల్గొన్నారు.