శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం
బాన్సువాడ, ఆగస్టు 21 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో వరలక్ష్మీ వ్రత వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని కొలిచారు. కార్యక్రమాన్ని పబ్బతి రాజు, కిల్బిల్ తుకారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పబ్బతి రాజు మాట్లాడుతూ.. వరలక్ష్మీ వ్రతానికి ఉన్న విశిష్టత, ప్రాధాన్యతను వివరించారు. శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో గత 33 సంవత్సరాలుగా వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ వ్రతంలో మొత్తం 25 మంది మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న మహిళలకు, విద్యార్థులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కిల్బిల్ తుకారం, భారతి తదితరులు పాల్గొన్నారు.






