calender_icon.png 3 February, 2026 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సభకు ఏర్పాట్లు.. కానిస్టేబుళ్లకు ప్రమాదం

03-02-2026 12:24:23 PM

హైదరాబాద్: నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీఏ కార్యాలయం(Miryalaguda RTA Office) వద్ద మంగళవారం కంటైనర్ బీభత్సం సృష్టించింది. మిర్యాలగూడలో అతివేగంతో దూసుకొచ్చిన కంటైనర్ బైకుపై వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుళ్లకు(Police Constablesమజార్, సురేశ్ కు తీవ్రగాయాలయ్యాయి. 

బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సభకు బాధితులు ట్రాఫిక్ ఏర్పాట్లు చేస్తున్నారు. గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.