లిఫ్ట్ ఇచ్చిన పాపానికి.. కారు యజమానిపై కత్తితో దాడి
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో లిఫ్ట్ ఇచ్చిన కారు యజమానిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఇమ్రాన్ అనే వ్యక్తి నల్గొండ నుంచి హైదరాబాద్(Nalgonda to Hyderabad) కు కారులో ప్రయాణిస్తున్నాడు. గుర్తుతెలియని వ్యక్తి నార్కట్ పల్లి వద్ద లిఫ్ట్ అడిగి కారు ఎక్కాడు. చిట్యాల వద్ద కారు యజమాని ఇమ్రాన్ పై దుండగులు కత్తిలో దాడి చేశాడు. ఇమ్రాన్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్, డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశాడు.
ఇమ్రాన్ ప్రతిఘటించడంతో దుండగుడు వదిలేసి పరారయ్యాడు. కత్తి వేటుతో తీవ్రంగా గాయపడిన ఇమ్రాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుడిని 108లో నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి(Nalgonda Government Hospital) తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన దుండగుడి కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబసభ్యులు కన్నీరుమన్నీరవుతున్నారు. దాడి చేసిన నిందితుడిన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.




