2 August, 2026 | 1:53 AM

‘ఈ20’తోనే పెట్రోల్ ధరల నియంత్రణ

02-08-2026 12:45 AM
  1. పశ్చిమాసియా యుద్ధ సమయంలో ధరలు పెరిగేవి..
  2. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.125 పలికేది..
  3. కానీ.. ఆ సమయంలో ధర రూ.94.77 మాత్రమే !
  4. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టత

న్యూఢిల్లీ, ఆగస్టు ౧: ‘ఈ 20 విధానంతోనే దేశంలో పెట్రోల్ ధరలు నియంత్రణలో ఉన్నాయి. లేకుందా.. పశ్చిమాసియా యుద్ధ సమయంలో ఇథనాల్ కలపని పెట్రోల్ ఒక లీటర్‌కు రూ.125 ధర పలికేది. ఈ20 (20% ఇథనాల్ కలిపిన ఇంధన) విధానంతోనే ఇంధన ధరలు నియంత్రణలో ఉన్నా యి’ అని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసిం ది. ఈ20 విధానంపై సమగ్రమైన స్పష్టత ఇస్తూనే, ఈ విధానాన్ని బలంగా సమర్థించుకున్నది.

హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల కారణంగా, అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక బ్యారెల్ ముడిచమురు ధర 135 డాలర్లకు చేరిందని స్పష్టం చేసింది. ఆ సమయంలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.125కు పెరగాల్సి ఉండేదని పేర్కొంది. కానీ, దేశీయంగా ఉత్పత్తి చేసిన ఇథనాల్‌ను పెట్రోల్‌ను 20 శాతం కలపడం వల్లే, ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.77 వద్దే స్థిరంగా ఉంచగలిగామని వివరించింది.

ఈ20 విధానం పన్ను చెల్లింపుదారులకు ఇచ్చే రాయితీ కాదని, అది దేశ ఇంధన భద్రతా కవచమని అభివర్ణించింది. ఈ20 విధానం ద్వారా వాహన నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేల్చిచెప్పింది. మైలేజీ కొంతమేర తగ్గుతుందనేది మాత్రం వాస్తవమని స్పష్టం చేసింది. మానవాళి వినియోగించుకోలేని బి య్యాన్ని మాత్రమే ఇథనాల్ తయారీకి వినియోగిస్తున్నామని వెల్లడించింది. ఈ తయా రీతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపింది.