2 August, 2026 | 1:46 AM

పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా మృతి

02-08-2026 12:46 AM
  1. బ్రాడ్‌పీక్ వద్ద బలి తీసుకున్న మంచు తుఫాను
  2. 10 మంది సభ్యుల బృందంలో ఒకరి దుర్మరణం
  3. పీవోకేలోని బ్రాడ్ పీక్ వద్ద ఘటన

ఖాఠ్మాండు/ఇస్లామాబాద్, ఆగస్టు 1: నేపాల్ పర్వతారోహకుడు ‘నిమ్స్‌దాయిష’ నిర్మల్ పుర్జాను మంచు తుఫాను బలితీసుకున్నది. 10 మంది సభ్యుల బృందం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బ్రాడ్ పీక్‌ను అధిరోహిస్తుండగా గురువారం సాయంత్రం మంచు తుఫాను వచ్చింది. ఈ తుఫానులో బృంద నాయకుడు పుర్జా గల్లంతై కన్నుమూశాడు. ఈ విషయం శనివారం వెలుగు చూసింది. బృందానికి నేతృత్వం వహిస్తున్న పుర్జానే దుర్మరణం పాలవడం సభ్యులను కలచివేసింది. మిగిలిన బృంద సభ్యుల్లో నేపాల్‌కు చెందిన ఐదుగురు పర్వతారోహకులు, పాకిస్థాన్, ఒమన్, అమెరికా, చైనాకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా సురక్షితంగానే ఉన్నారని పాక్ ప్రభుత్వం ధ్రువీకరిం చింది.

పర్వతారోహకుల వద్దకు రెస్క్యూ టీంను పంపిస్తున్నామని తెలిపింది. పుర్జా మృతికి నేపాల్ ప్రధాని బలేన్‌షా ది గ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ బ్రాడ్ పీక్ ఎత్తు 8,051 మీటర్లు. ఇది ప్రపంచంలోనే 12వ అత్యంత ఎత్తున పర్వతం. కేణి-2 శిఖరానికి సమీపంలో ఉండే ఈ పర్వతాన్ని అధిరోహించడం కష్టంతో కూడుకున్న పని. 1957 జూన్‌లో ఆస్ట్రియన్ బం దం మొదటిసారిగా పర్వతాన్ని అధిరోహించింది. 1892 లో బ్రిటీష్ అన్వేషకుడు మార్టిన్ కాన్వే పర్వతానికి ‘బ్రాడ్ పీక్’ అని నామకరణం చేశారు. 

ఎన్నో రికార్డులు

మంచు పర్వత శ్రేణులపై నిర్మల్ పుర్జా సష్టించిన రికార్డులు అసాధారణమైనవి. ప్ర పంచంలో 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న 14 పర్వతాలను అధిరోహించిన రికార్డు ఆయన పేరు పై ఉంంది. అంతకుముందు దక్షిణ కొరియా పర్వతారోహకుడు కిమ్ చాంగ్-హోపై ఆ రికార్డు ఉం ది. పుర్జా సాహస యాత్ర ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ ‘14 పీక్స్: నథిం గ్ ఈజ్ ఇంపాజిబుల్’ పేరుతో ఒక డా క్యుమెంటరీని సైతం  రూపొందించింది. 

పర్వతారోహకుడిగా మారకముం దు పుర్జా బ్రిటీష్ మిలిటరీలో 16 ఏళ్ల పాటు సేవలు అందించారు. ప్రారంభ దశలో ‘బ్రిగేడ్ ఆఫ్ గుర్ఖా’లో పనిచేసిన ఆయన, తరు వాత రాయల్ నేవీకి చెందిన ప్రత్యేక దళం లో చేరారు. మిలిటరీ సేవలకు గాను 2018 లో ఆయనకు ‘మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్స్ (ఎంబీఈ) లభించింది. 2012లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను సందర్శించారు. అప్పటి నుంచి ఆయనకు పర్వతారో హణపై ఆసక్తి పెరిగింది. తర్వాత ‘నిమ్స్‌దాయి ఫౌండేషన్’ స్థాపించి నేపాల్‌లోని పర్వత ప్రాంత ప్రజలకు సహాయ సహకారాలు అందించేవారు.