24 June, 2026 | 2:44 PM

Breaking News

బుధవారంపేటలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం   •   జోరుగా జీరోలో చల్లని పానీయ వ్యాపారం   •   అర్హులైన పేదలందరికీ ఇళ్లు   •   రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •  

తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూం

03-03-2026 01:34 AM

హైదరాబాద్, మార్చి2 (విజయక్రాంతి): పశ్చిమాసియా లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్, -ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో గల్ఫ్ దేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసుల భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులకు, కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఓ ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

తెలంగాణ భవన్‌లోని కంట్రోల్ రూమ్ నిరంతరం అందుబాటులో ఉండనుంది. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారు లేదా వారి కుటుంబ సభ్యులు ల్యాండ్‌లైన్ నెంబర్ 011-23380556కు అధికారులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్ వందర బరువా 91 98719 99044, లైజన్ ఆఫీసర్ జి.రక్షిత్ నాయక్  91 96437 23157, పీఆర్వో సీహెచ్ చక్రవర్తి  91 99493 51270 నెంబర్లలో అందుబాటులో ఉండనున్నారు.