3 March, 2026 | 12:14 PM

చంద్రగ్రహణం నేపథ్యంలో ఏడుపాయల ఆలయం మూసివేత

03-03-2026 10:38 AM

పాపన్నపేట, ఫిబ్రవరి26: మంగళవారం చంద్రగ్రహణం(Lunar Eclipse) నేపథ్యంలో రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల(Edupayala Temple closed ) వనదుర్గామాత ఆలయాన్ని ఉదయం 6 గంటలకు మూసివేశారు. వేకువ జామున 5 గంటలకు అమ్మవారికి అభిషేకం, అలంకరణ నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేసారు. బుధవారం వేకువ జామునే ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం ఉదయం 8 గంటల నుంచి  అమ్మవారి దర్శనం యధావిధిగా కొనసాగుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.