25 February, 2026 | 9:15 AM

సౌదీ రోడ్డు ప్రమాదంపై కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు.. నంబర్లు ఇవే..

17-11-2025 10:19 AM

మదీనా: సౌదీ అరేబియాలోని(Saudi Arabia) స్థానిక మీడియా ప్రకారం సోమవారం మదీనా సమీపంలో ఉమ్రా యాత్రికులతో వెళుతున్న బస్సు(Saudi bus accident) డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో కనీసం 42 మంది సజీవ దహనమయ్యారు. బాధితులు భారతీయులుగా భావిస్తున్నారు. వీరిలో చాలామంది హైదరాబాద్‌కు చెందినవారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో(Embassy of India) సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) న్యూఢిల్లీలోని అధికారులను అప్రమత్తం చేశారని, రాయబార కార్యాలయ అధికారులతో సన్నిహితంగా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారని రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో ధృవీకరించింది.  సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం మృతుల్లో హైదరాబాద్‌ మల్లేపల్లి బజార్ ఘాట్ కు సంబంధించిన 16 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు.

కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు: 

+91 79979 59754

+91 99129 19545