calender_icon.png 17 November, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొంథా తుఫాను బాధితులకు పరిహారంపై హైకోర్టులో విచారణ

17-11-2025 01:49:35 PM

హైదరాబాద్: మొంథా తుఫాను (Cyclone Montha victims) బాధితులకు పరిహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు 2 రోజుల గడువు కోరారు. విచారణను హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలపై పిల్ దాఖలైంది. ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై కౌంట్ దాఖలు చేయాలని హైకోర్టు(Telangana High Court) ఆదేశించింది. ప్రభుత్వం నుంచి వివరాలు అందాయని, కౌంటర్ దాఖలుకు జీపీ సమయం కోరారు. మొంథా తుఫాను కారణంగా తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురిశాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాను తీరం దాటిన తరువాత తెలంగాణలోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. వరంగల్, హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం భారీ కురిసింది. భారీ వర్షాలతో పలు కాలనీలు, గ్రామాలు, తండాలు నీట మునిగాయి. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మొంథా ఎఫెక్ట్ పడిన వారు ఇప్పటికీ కోలుకోలేదు.