calender_icon.png 17 November, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంటినెంటల్ హాస్పిట‌ల్‌లో లారింజాలజీపై అంతర్జాతీయ సీఎంఈ సదస్సు

17-11-2025 09:40:20 AM

  1. పత్రికా ప్రకటన
  2. వోకల్ ఫోల్డ్ వ్యాధులు, అత్యాధునిక చికిత్సల పై రెండు రోజుల పాటు చర్చ
  3. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నూతన సాంకేతికతలను యువ వైద్యులు అందిపుచ్చుకోవాలి-డా. గురు ఎన్ రెడ్డి (కాంటినెంటల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు)
  4. యూనిలేటరల్ వోకల్ ఫోల్డ్ ప్యారాలిసిస్, & వోకల్ ఫోల్డ్ క్యాన్సర్స్ ను నిర్లక్ష్యం చేయొద్దని నిపుణుల సూచన
  5. అత్యాధునిక వాయిస్ క్లినిక్ తో ముందంజలో కాంటినెంటల్ హాస్పిటల్స్
  6. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆస్ట్రేలియా సిడ్నీలోని ఓ బ్రియన్ లైఫ్ హౌస్ డాక్టర్ కార్డెన్ పాల్మే, తిరువంతపురం డాక్టర్ జయకుమార్.
  7. దేశ విదేశాల నుంచి 150 మందికి పైగా నిపుణుల హాజరు.

హైదరాబాద్: కాంటినెంటల్ హాస్పిటల్స్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో లారింజాలజీకి సంబంధించిన అంతర్జాతీయ స్థాయి సీఎంఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వోకల్ ఫోల్డ్ ప్యారాలిసిస్, ప్రారంభ దశ గ్లోటిక్ క్యాన్సర్పై ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిచెందిన నూతన చికిత్సా పద్ధతులు, శాస్త్రీయ పురోగతులు, శస్త్రచికిత్సా సాంకేతికతలు వంటి అంశాలపై నిపుణులు తమ అనుభవాలు పంచుకున్నారు. 

యూనిలేటరల్ వోకల్ ఫోల్డ్ ప్యారాలిసిస్ & వోకల్ ఫోల్డ్ క్యాన్సర్స్ కి ముందస్తు గుర్తింపే ప్రధానం

ఒక వోకల్ ఫోల్డ్ పనిచేయకపోవడం వల్ల రోగులకు గొంతు భగ్గుమన్నట్లు అనిపించడం, మాట్లాడడంలో ఇబ్బంది, మింగడంలో సమస్యలు ఏర్పడతాయి. ఇలా మూడు వారాలకుపైగా గొంతుమండుతున్నట్లు అన్పించినా, అలాగే ధూమపానం, మద్యపానం చేసేవారు కూడా వెంటనే ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి లారింజోస్కోపీ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్ ని ముందుగానే గుర్తిస్తే, CO. లేజర్ శస్త్రచికిత్సతో, మంచి ఫలితాలను సాధించవచ్చని వైద్యులు తెలిపారు. దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను వీడియోల రూపంలో ప్రదర్శించారు.

అత్యాధునిక వాయిస్ క్లినిక్తో ముందంజలో కాంటినెంటల్ హాస్పిటల్స్

గొంతు సమస్యలు, వోకల్ ఫోల్డ్ ప్యారాలిసిస్, లారింక్స్ క్యాన్సర్ వంటి సమస్యల చికిత్సలో కాంటినెంటల్ హాస్పిటల్స్ విశేష సేవలు అందిస్తున్న అత్యాధునిక వాయిస్ క్లినిక్ను నిపుణులు ప్రస్తావించారు. ఈ విభాగానికి.. డా. దుష్యంత్ గణేశుని (లారింజాలజిస్ట్ & వాయిస్ సర్జన్), డా. క్రాంతి కుమార్ గంగిటీ (హెడ్ & నెక్ ఆంకోసర్జన్) నాయకత్వం వహిస్తున్నారు. ఇంజెక్షన్ లారింజోప్లాస్టీ, టైప్-1 థైరోప్లాస్టీ, CO, లేజర్ శస్త్రచికిత్స వంటి ఆధునిక పద్ధతుల్లో ఆసుపత్రి వైద్యులు నైపుణ్యం సాధించినట్లు పేర్కొన్నారు.

ఆధునిక సాంకేతికతలను స్వీకరించాల్సిన అవసరం ఉంది: డా. గురు ఎన్. రెడ్డి

కాంటినెంటల్ హాస్పిటల్స్ చైర్మన్ డా. గురు ఎన్. రెడ్డి మాట్లాడుతూ, ఈఎన్టీ శస్త్రచికిత్స రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో యువ ఈఎన్టీ వైద్యులు ఎవిడెన్స్- బేస్డ్ మెడిసిన్ పై దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన సాంకేతికతలు వైద్యరంగాన్ని మరింత మెరుగుపరుస్తాయని, వైద్యులు వాటిని వినియోగించుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

150 మందికి పైగా నిపుణుల హాజరు

దేశవ్యాప్తంగా మరియు విదేశాల నుండి 150 మందికి పైగా ఈఎన్టీ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఒటోలారింజాలజిస్ట్స్క చెందిన తెలంగాణ మరియు హైదరాబాద్ శాఖలు కూడా ఇందులో భాగమయ్యాయి. బెంగళూరు, తిరువనంతపురం, హైదరాబాద్ నుంచి ప్రముఖ నిపుణులు డా. సంజయ్ సుబ్బయ్య, డా. అక్షయ్ కుడ్ప జే, డా. మంజునాథ్ MK, డా. మంజు ఐజాక్, డా. విష్ణు స్వరూప్ రెడ్డి N, డా. ఆశీష్ డోరా G, డా. మాధవ్ K – తమ అనుభవాలు, పరిశోధన వివరాలను పంచుకున్నారు.