మూసీ సుందరీకరణకు సహకరించాలి
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి
అబ్దుల్లాపూర్ మెట్, జూన్ 25: మూసీ సుందరీకరణకు ప్రతి ఒక్కరు సహకరించాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్( రెవెన్యూ) కే. చంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని బాచారం, గౌరెల్లి, తిమ్మాయిగూడ, కుత్బుల్లాపూర్, మర్రిపల్లి గ్రామాలలో స్థానిక తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రాంబాబులతో కలసి మూసీ పరివాహక ప్రాంతాలలో పర్యటించి.. మూసీ సుందరీ కరణ కోసం భూసేకరణపై రైతులతో చర్చించారు.
అనంతరం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ... మూసీ సుందరీకరణకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. సుందరీకరణతో మూసీ పరివాహక ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రాంబాబు, మండల సర్వేయర్ వెంకటేష్, జీపీవో, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.






