అధికారులకు సమన్వయం అవసరం: తలసాని
సనత్‌నగర్, మార్చి ౧౬ (విజయక్రాంతి): అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశిం చారు. సోమవారం ఆయన అమీర్‌పేటలోని బుద్దానగర్‌లో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్య టించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాలనీలో నూతనంగా చేపట్టిన స్ట్రామ్ వాటర్ లైన్ పనులను పరిశీలించారు.
ఇబ్బందులు తలెత్తకుండా ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా దెబ్బతిన్న డ్రైనేజీ లైన్ మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు కూడా అభివృద్ధి పనులలో అధికారులకు తమవంతు సహకారం అందించాలని చెప్పారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజం బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు ప్రవీణ్ రెడ్డి, అశోక్ యాదవ్, కూతురు నర్సింహ, కట్టా బలరాం, లలిత, గోపిలాల్ చౌహాన్, వేణు గౌడ్, గొలుసుల సత్యనారాయణ, వనం శ్రీనివాస్, హరిసింగ్, జితేందర్ శుక్లా తదితరులు ఉన్నారు.




