4 May, 2026 | 2:24 AM

తెలంగాణ చౌక్‌లో జీవో నంబర్7 ప్రతుల దగ్ధం

04-05-2026 01:08 AM

కొత్తపల్లి, మే 3(విజయక్రాంతి):బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు నారోజు రాకేష్ అధ్యక్షతన బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రోజునతెలంగాణ చౌక్ జీవో నంబర్ 7 ప్రతులను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నారోజు రాకేష్ మాట్లాడుతూ బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కీమును రద్దు చేయాల నే కుట్రతో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 7 ను తీసుకువచ్చింది, ఒకవైపు కాలేజీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల వద్ద ఫీజు వసూలు చేసుకోవచ్చు అని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం, దాదాపు కోర్టు తీర్పును సమర్ధిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను గత నాలుగు సంవత్సరాలుగా విడుదల చేయకుండా,

ఇంకొక వైపు ఫీజు రియం బర్స్మెంట్ నిధులు విద్యార్థుల ఖాతాలలో జమ చేస్తామని, ఇక విద్యార్థుల నుండి ప్రైవేట్ కాలేజీలు అడ్మిషన్ సమయంలో ఫీజులు వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పకనే జీవో నెంబర్ 7 ద్వారా చెప్పింది,కావున ఈ జీవో నెంబర్ 7 బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత వి ద్య నుండి వెళ్లగొట్టడానికి, ఇది బీసీ విద్యార్థుల చదువుకు గొడ్డలి పెట్టు లాంటిది ఈ కుట్రలను వ్యతిరేకిస్తూ ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని యధావిధిగా అమలు చేయాలని, గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 7500 కోట్ల ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూన్నమని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి జి ఎస్ ఆనంద్,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ,జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవరకొండ సంతోషిని, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మంతెన కిర ణ్,బ్రహ్మచారి,మురళి,బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాజే ప్రజ్జోత్ ,బిసి విద్యార్ధు సంఘం ఉపాధ్యక్షులు , బియ్యని తిరుపతి,బోయిని ప్రశాంత్,విజయ్ , ఆశిష్ గౌడ్ పురుషో త్తం,ఆదర్శ్‌లతో పాటు బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.