10 June, 2026 | 1:06 AM

స్కూల్ విద్యార్థులకు రాగి జావ

10-06-2026 12:00 AM

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడి 

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాగి జావ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ మంగళవారం ఉత్తర్వు లు జారీ చేశారు. పీఎం పోషణ్, మిడ్ డే మిల్స్ పథకంలో భాగంగా వారానికి మూడు రోజులు ఒకటో తరగతి నుంచి 10 తరగతి  విద్యార్థులకు రాగి జావను అందించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.