10 June, 2026 | 1:06 AM

నేడు పలు ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక పూజలు

10-06-2026 12:00 AM

నిర్వహించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు

ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన సందర్భంగా..

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ప్రధాని మోదీ దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు, దేశ సేవ మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హైదరాబాద్ నగరంలోని పలు ప్రార్థనా మందిరాల్లో బుధవారం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశం సాధించిన సుపరిపాలన, అభివృ ద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భారతదేశ ప్రగతి పథంపై మీడియా ప్రతినిధులతో మాట్లాడుతారు.

కార్యక్రమ వివరాలు..

ఉదయం 7.30 గంటలకు శివాలయం, తార్నాక (ఆర్టీసీ ఆసుపత్రి సమీపంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం), ఉదయం 8.30 గంటలకు, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, ఆనంద్‌బాగ్, ఉదయం 9.30 గంటలకు జైన్ దేవాలయం, రసూల్‌పురా, మధ్యాహ్నం 12 గంట లకు, హరిత ప్లాజా, బేగంపేట్, హైదరాబాద్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 సంవత్సరాల సుపరిపాలన, అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై మీడియా సమావేశం.