ద్వారకాపురం కమ్యూనిటీ హాల్ సమస్యపై కాలనీవాసులతో సమీక్ష
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కారానికి చర్యలు
నాగోల్, జూన్ 9 (విజయక్రాంతి): చైతన్యపురి పరిధిలోని ద్వారకాపురం కమ్యూని టీ హాల్కు సంబంధించిన సమస్యపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్థానిక కాలనీవాసులతో సమావేశమై చర్చించారు. కమ్యూనిటీ హాల్ అంశంపై నెలకొన్న పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకుని, ప్రజల సూచనలు, అభి ప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు కమ్యూనిటీ హాల్ నిర్వహణ, వినియోగం తదితర అంశాలకు సంబంధించిన తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజల అభిప్రాయాలను శ్రద్ధగా విన్న సుధీర్ రెడ్డి, సమస్యను సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి తగిన పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. కాలనీలో ప్రజా అవసరా లకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, స్థానికుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజల భాగ స్వామ్యంతోనే సమర్థవంతమైన పరిష్కారాలు సాధ్యమవుతాయని అన్నారు. ఈ సమావేశంలో సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు ప్రసాద్, కాలనీవాసులు నారాయణ రావు, రాఘవరెడ్డి, శ్రావణ్, సత్యనారాయణ స్థానికులు పాల్గొన్నారు.






