27 June, 2026 | 3:32 AM

లింగ్యా తండాలో కార్డెన్ సర్చ్

27-06-2026 02:14 AM

మహబూబాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): కురవి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగ్య తండా గ్రామంలో ’కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్’ శుక్రవారం ఉదయం ఐదు గంటల నుండి 7:30 గంటల వరకు పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా సుమారు 300 ఇళ్లు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

తనిఖీలో సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 15 వాహనాలను గుర్తించారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన 100 కిలోల నల్ల బెల్లం, 50 లీటర్ల గుడుంబా, 50 కిలోల పటిక, 16 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, 500 లీటర్ల నల్ల బెల్లం ఊటను అక్కడికక్కడే ధ్వంసం చేసి , సదరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ రూరల్ సర్కిల్ ఫోర్స్కు చెందిన మొత్తం 30 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.