27 June, 2026 | 3:32 AM

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

27-06-2026 02:15 AM

సీఐ మన్మధ కుమార్ 

చౌటుప్పల్, జూన్ 26 : మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల ఆరోగ్యం, భవిష్య త్తును నాశనం చేస్తుందని కావున యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ అన్నా రు. శుక్రవారం తంగడపల్లిలోని బీపీఈడీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ, ఆరో గ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

సమాజంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాల ని, అనుమానాస్పద సమాచారం ఉంటే పో లీసులకు తెలపాలన్నారు. అనంతరం విద్యా ర్థులతో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చే యించి, ‘రన్ ఫర్ డ్రగ్ ఫ్రీ సొసైటీ’ అవ గాహన రన్ను నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో కళాశాల ప్రిన్సిపాల్, పోలీస్ స్టేషన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.