calender_icon.png 26 December, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓసి సింహ గర్జన విజయవంతం చేయండి

26-12-2025 09:27:30 PM

ఓసి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గోపు జయపాల్ రెడ్డి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హసన్ పర్తి ఎర్రగట్టు గుట్ట శుక్రవారం బాలాజీ గార్డెన్ లో వీసం సురేందర్ రెడ్డి అధ్యక్షతన బహిరంగ సభ సన్నాహ సమావేశానికి గోడ పత్రిక ఆవిష్కరణకు రాష్ట్ర అధ్యక్షులు గోపు జయపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ... జాతీయస్థాయిలో ఓసిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మొదటి నుండి అగ్రకులాల పేదలకు అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా హక్కుల సాధనకై జనవరి 11న ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం.

ఈ సభ ద్వారా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కాలపరిమితి ఐదు సంవత్సరాలకు పెంచాలని విద్య, ఉద్యోగ పోటీ పరీక్షల పరిమితి పెంచాలని, బ్యాక్ లాక్ పోస్టులను వెంటనే భక్తి చేయాలని, విద్యార్థులకు టెట్ పరీక్ష అర్హత 90 మార్కుల నుంచి 70 మార్కులకు తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలనే డిమాండ్లతో జనవరి 11న నిర్వహించబడే సభకు రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, మార్వాడి, కమ్మ, వెలమ సోదరులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం సీతంపేట కేశవాపూర్ సర్పంచులు మేక రమ్య భగవాన్ రెడ్డి, మోత్కుపల్లి శ్రీకాంత్ రెడ్డి లను ఉపసర్పంచ్లు సుడల భరత్ రెడ్డి, పోరెడ్డి వాణి విలాకర్ రెడ్డి, వార్డు సభ్యులను సన్మానించారు.