26-12-2025 09:22:07 PM
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాచలం (విజయ క్రాంతి): “YERU – The River Festival” లో భాగంగా రేపు (శనివారం) సాయంత్రం 4 గంటల నుండి భద్రాచలం తెప్పోత్సవ ఘాట్ వద్ద ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం మరియు నది హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జితేష్ వి. పాటిల్, జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 230 మంది లోకల్ యువత పాల్గొనే ఫ్లాష్ మోబ్ పెర్ఫార్మెన్స్ (Flash Mob Performance) (ఒకేసారి నృత్యం) ప్రధాన ఆకర్షణగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
యువత సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు, నదుల పట్ల అవగాహనను పెంపొందించే విధంగా ఈ ప్రదర్శనలు రూపొందించబడ్డాయని తెలిపారు. ఫ్లాష్ మోబ్ పెర్ఫార్మెన్స్ అనంతరం నది హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ గారు తెలిపారు. నదుల సంరక్షణ, ప్రాధాన్యతపై ప్రజల్లో చైతన్యం కలిగించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యమని ఆయన వివరించారు.