calender_icon.png 26 December, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ వీర బాలల దినోత్సవం

26-12-2025 09:31:06 PM

జోరా సింగ్, ఫతే సింగ్ లకు ఏబీవీపీ నివాళి

చిట్యాల,(విజయక్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చిట్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో జాతీయ వీర బాలల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక పాఠశాలలో జోరా సింగ్, ఫతే సింగ్ చిత్రపటానికి విదార్థులు శుక్రవారం పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ మాత్మ గాంధీ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు కొంపల్లి సూర్య, చిట్యాల నగర కార్యదర్శి వంగూరు గణేష్ మాట్లాడుతూ... మొఘలుల అరాచక పరిపాలనను ఎదిరించి ప్రాణత్యాగానికి వెనుకాడని సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు 7 సంవత్సరాల ఫతేసింగ్, 9 సంవత్సరాల జొరావర్ సింగ్‌ వీరగాథను వారి త్యాగాలను దేశ ప్రజలు నిత్యం స్మరించుకోవాలి.

చిన్నపిల్లలు అయినా సరే తండ్రి, అన్నల బాటలో దేశం కోసం, ధర్మం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించిన  భారత మాత ముద్దు బిడ్డలు అని నాటి నవాబ్ వజీర్ ఖాన్ చూపెట్టిన ప్రలోభాలకు తాయిలాలకు లొంగకుండా చూపెట్టిన భయానికి భయపడకుండా తమ తండ్రి గురు గోవింద్ సింగ్ గౌరవ మర్యాదలను కాపాడుకుంటూ ఈ దేశ ధర్మ స్వాభీమానాన్ని ఏ విదేశీ దురాక్రమదారుడి ముందు తాకట్టు పెట్టకుండా నవాబ్ 24 డిసెంబర్ 1704న  సజీవ సమాధిని చేస్తున్న సరే వారిలో ఎక్కడ భయము అనేది లేకుండా స్వాభిమానంతో వీరత్వాన్ని ప్రదర్శించి ఈ దేశ ధర్మ స్వాభిమానం అన్నిటికంటే విలువైనదని పసివయసులో ప్రాణత్యాగం చేసి నిరూపించిన  ఆ వీర బాలలను వారి త్యాగాన్ని ప్రతి భారతీయుడు ప్రతిదినము స్మరించుకుంటు స్ఫూర్తిగా తీసుకోవలని అన్నారు.