30 June, 2026 | 11:56 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

కేసీఆర్‌ను కలిసిన కార్పొరేటర్ సింధు ఆదర్శ్‌రెడ్డి

10-03-2026 02:05 AM

పటాన్‌చెరు, మార్చి 9 : పటాన్చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి భారతినగర్ డివిజన్ మా జీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి సోమవా రం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సింధు ఆదర్శ్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా పటాన్చెరు నియోజక వర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో మాజీ మంత్రి హరీశ్ రావు సూచనల మేరకు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో గెలవడం జరిగిందని తెలిపారు. ఈ విజయంపై కేసీఆర్ ఆదర్శ్ రెడ్డి ని అభినందించారు. అనంతరం పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలపై ఆయనతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పార్టీని నియోజకవర్గంలో పార్టీని మరింత బలో పేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.