10 March, 2026 | 3:41 AM

‘గీతం’కు వన మహోత్సవ అవార్డు

10-03-2026 02:06 AM

అవార్డు ప్రధానం చేసిన మంత్రి వివేక్ 

పటాన్ చెరు, మార్చి 9: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గత ఏడాది (2025లో) చేపట్టిన పర్యావరణ స్థిరత్వం, హరిత కార్యక్రమాల నిరంతర నిబద్ధతకు గుర్తింపుగా వన మహోత్సవ అవార్డు 2026తో సత్కరించారు.

హైదరాబాదులో జరిగిన కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ యొక్క 2025-26 వార్షిక సమావేశంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖల మంత్రి జి.వివేక్ వెంకట స్వామి చేతుల మీదుగా గీతం హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ ఈ అవార్డును అందుకున్నారు. పెద్దయెత్తున మొక్కలు పెంచడం, ప్రాంగణంలో పర్యావరణ హిత అవగాహనా కార్యక్రమాలను నిర్వహించి, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తున్న సంస్థలకు ఈ అవార్డును ప్రధానం చేస్తారు.

గీతం హైదరాబాదు ప్రాంగణం నిరంతరం మొక్కల పెంపకం, పర్యావరణ అవగాహనా సదస్సులు, సమాజాభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. తద్వారా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొనడానికి, ప్రాంగణంలో ఆ సంస్కృతిని నిరంతరం కొనసాగించేలా ప్రోత్సహిస్తోంది. ఈ సందర్భంగా గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, వివిధ స్కూళ్ల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, పలు విభాగాల అధిపతులు హర్షం వ్యక్తం చేశారు.