17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అవినీతిమమైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్

22-02-2026 02:04 AM

రాష్ట్రంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయానికి అవకాశం 

అడ్వకేట్ శరత్ కుమార్ 

ఈ రాజకీయ కుటమి ఆరంభమే.. 

త్వరలో మరిన్ని పార్టీలు చేరుతాయి: కసిలవాయి

ఖైరతాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయ కుటమి ఆధ్వ ర్యంలో తెలంగాణ రాజకీయాలలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమా? అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ అధ్యక్షతన శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అడ్వకేట్ శరత్ కుమార్ మాట్లాడు తూ.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.

ప్రస్తుతం ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయానికి విస్తృత అవకాశం ఉందని పేర్కొన్నారు. అవినీతిగ్రస్తమైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, పనితీరు లేని బీజేపీని రాజకీయంగా తోసిపుచ్చాలన్నారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగు లు, నిరుద్యోగులు, పెన్షనర్లు, మహిళలు ఆదితర బలహీన వర్గాల్లో అపారమైన శక్తి ఉందనీ, ఆ శక్తిని రాజకీయ శక్తిగా మలచాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

కపిల వాయి ఇందిర, ఆర్‌ఎల్డీ జాతీయ మహిళా అధ్యక్షురాలు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ తీవ్రమైన అవినీతిలో మునిగిపోయాని, తెలంగాణ అమరవీరులను, రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పోరాడిన ప్రజలను పూర్తిగా మరిచిపోయాయని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు (95 శాతం) రాజకీయ అధికారం సాధించేందుకు ఒక్కటైన తొమ్మిది పార్టీలను ఆమె అభినందించారు.

కపిలవాయి దిలీప్ కుమార్, కార్యదర్శి జనరల్ మాట్లాడుతూ.. ఈ రాజకీయ కుటమి కేవలం ఆరంభమేనని, త్వరలో మరిన్ని పార్టీలు ఇందులో చేరతాయని తెలిపారు. ప్రతి జిల్లాలో ప్రతి నెల జాబ్ మేళాలు, లోస్ మేళాలు, స్కిల్ మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు. గాలి వినోద్ కుమార్ మాట్లాడు తూ.. చిన్న, సన్నకారు రైతులు, ఈబీసీ, బీపీఎల్ వర్గాల భూములను రక్షించేందుకు రాజకీయ కుటమి కట్టుబడి ఉంటుందన్నారు. ఈ సమావేశానికి శేషగిరి రావు అధ్యక్షత వహించారు.