22-02-2026 02:05:52 AM
వికారాబాద్, ఫిబ్రవరి -21 (విజయక్రాంతి): కాం గ్రెస్ పార్టీ ప్రస్తుత జిల్లా అధ్యక్షుల ప్రతి చర్యను పార్టీ గమనిస్తున్నదని, పనిచేయకుండానే ఎన్నికల సమయంలో నాయకుల కోటాలో టికెట్ వస్తుందని అను కోవద్దని, కాంగ్రె స్ పార్టీలో మెరిట్ కోటా తప్ప మరో కోటా లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశా రు. మెరిట్ కోటాలో పాస్ అయితేనే పార్టీలో అవకా శం వస్తుందని ఆయన చెప్పారు. ‘కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అయ్యాం కాబట్టి జీవితంలో కష్టపడాల్సిన అవసరం లేదని అనుకుంటే మీ అవకాశాన్ని మీరే జారవిడుచుకున్న వాళ్లు అవుతారు.
ఎమ్మెల్యే సత్యం, బీర్ల ఐలయ్య, రామ్మోహన్‌రెడ్డిల లాంటివారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాగా పనిచేసినందుకే వారికి ఎమ్మెల్యే అయ్యే అవకాశం వచ్చింది’ అని ముఖ్యమం త్రి అన్నారు. జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు కేవలం 16 ఏళ్లలో నే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తనకు వచ్చిందని, అది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుందని సీఎం తెలిపారు. శనివారం వికారాబాద్‌లోని అనంతగిరి హరిత రిసార్ట్‌లో ఆంధ్రప్రదే శ్, తెలంగాణ రాష్ట్రాల కాంగ్రె స్ పార్టీ జిల్లా అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అధ్యక్షతన ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేడు ప్రభుత్వం లో ఉన్న వారందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఊరికే రాలేద ని, ప్రతిపక్షంలో ఉన్న నాడు జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారికే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని గుర్తుచేశా రు. ఎమ్మెల్యే టికెట్లు రాని వారికి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చామని, అక్కడ అవకాశం రాని వారికి ఎక్కడో ఒకచోట మంచి స్థాయిలో ఉం చామని తెలిపారు.
‘అధికారంలోకి రాకముందు పార్టీ బాధ్యతలు తీసుకోవాలని చాలామందికి చెప్తే నామోషిగా ఫీల్ అయ్యా రు. మీ అదృష్టం బాగుండి మీరు పీసీసీ అధ్యక్షులు అయ్యారు. మేము కూడా పీసీసీ అధ్యక్షులమయ్యే స్థాయి ఉన్నవారమని నాతో ఆనాడు చాలామంది అన్నారు’ అని సీఎం తెలిపారు. ఆరోజు పార్టీ బాధ్యతలు తీసుకున్న 37 మంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో చూసి, ఆనాడు బాధ్యత తీసుకోని వాళ్లు ఇప్పుడు బాధపడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షు డికి ఎమ్మెల్సీ ఇచ్చామని, యూత్ కాంగ్రెస్ జాతీయ జనరల్ సెక్రెటరీకి రాజ్యసభ, యూ త్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడికి షాప్ చైర్మన్ ఇచ్చినట్లు వెల్లడించారు. పార్టీ పదవులను తీసుకున్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసినట్లు సీఎం తెలిపారు. 65 మంది కార్పొరేషన్ చైర్మన్లుగా పార్టీ బాధ్యతలు నిర్వహించిన వారికే ఇచ్చామని, వెతికి మరి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చినట్లు తెలిపారు. ‘జిల్లా అధ్యక్షులుగా మెరిట్ కోటా కొంత సాధించారని, మీకు నాతో పాటు పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ఇన్‌చార్జి స్థాయి వ్య క్తులను, మంత్రులను నేరుగా కలిసే అవకాశం వచ్చింది’ అని అన్నారు.
జిల్లా అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీలో అన్ని తలుపులు తెరిచి ఉంటాయని, జాతీయస్థాయి నాయకులు రాహుల్‌గాంధీ, ఖర్గే, ప్రియాంకగాంధీ లాంటి వారితో కలిసి మాట్లాడే అవకాశం వస్తుందని తెలిపారు. అనుభవాలను, ఆలోచనలను పంచుకునే అవకాశం కలుగుతుం దన్నారు. పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వా ళ్లకు పార్టీ గుర్తింపునిస్తుందనడానికి అదిలాబాద్ ఎమ్మెల్యేనే ఉదాహరణ అని సీఎం గు ర్తుచేశారు.
డీసీసీ పదవి విలువైనది
జిల్లా అధ్యక్షులుగా చాలామంది డబ్బు ఉన్నవారు, లేనివారు ఉండవచ్చునని వాటన్నిటికంటే జిల్లా అధ్యక్షుడి పదవి చాలా వి లువైందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పదవిని దుర్వినియోగం చేసుకోకుంటే ఎవరూ కాపాడలేరని, పదవిని పొదుపుగా వాడుకొని ప్రజలను సమన్వయం చేసుకొని ముం దుకు పోతే ఎమ్మెల్యేనో, ఎంపీనో అదృష్టం బాగుంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటుందన్నారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది రాజకీయ జీవితంలో తొలిమెట్టని తెలిపారు. జిల్లా అధ్యక్ష పదవికి ఎంతోమంది పోటీపడి ఉంటారని వారందరినీ కాదని మీకు ఇచ్చారంటే మీ మీద పార్టీ ఎంతో నమ్మకం పెట్టుకుందన్నా రు. పార్టీలో నచ్చిన వారితోపాటు నచ్చ ని వారిని కూడా చేరదీసి, తమ దారికి తెచ్చుకోవాలని సూచించారు.
ఎన్నికల సమ యం లో ఎవరిని కూడా పార్టీలో నుంచి పోకుం డా ప్రయత్నించి బుజ్జగించినట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షులుగా ఉండి పైరవీ కారులుగా మారితే చులకనగా మారతారన్నారు. ప్రజా సమస్యల్ని ఎమ్మెల్యేలకు, మంత్రుల ద్వారా పరిష్కరిస్తే గౌరవం దక్కుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
గాంధీ ప్రాణాలు తీశారు
దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీపై లాఠీ లేపడానికి ఆంగ్లేయులే భయపడ్డారని, అలాంటి వ్యక్తిని భార తీయులమని చెప్పుకునే బీజేపీ మూలాలు ఉన్న వ్యక్తులే హత్య చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. మహాత్మా గాంధీతో పాటు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కో సం ప్రాణ త్యాగం చేశారని తెలిపారు. దేశం రాజకీయ అనిశ్చితిలో ఉన్నప్పుడు సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోశారని గుర్తుచేశారు. త్యాగాలు చేసి న కుటుంబంలోని రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని కాంక్షించారు.
ఇంత ఘన చరిత్ర ఉన్నా, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 150 రోజులు 4 వేల కిలోమీటర్లు రాహుల్‌గాంధీ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తీసుకునే నిర్ణయాలపై కొందరు భిన్నభిప్రాయాలు చెపుతారని, అంతమాత్రాన వారిని పార్టీనుంచి పంపించేందుకు ప్రయత్నించడం చేయవద్దని సూ చించారు. జాతీయస్థాయి నాయకులు తీసుకుని నిర్ణయాల పట్ల కూడా కార్యకర్తలు భిన్నభిప్రాయాన్ని చెప్పే సం స్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నదన్నారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.