7 April, 2026 | 3:05 AM

పాలేరు పంచాయతీలో అవినీతి

07-04-2026 12:51 AM

పైసలతో పనులు జరుగుతున్నాయా..?

కార్యదర్శిపై విచారణకు ఆదేశించిన డీపీఓ

పారదర్శకంగా విచారణ చేపట్టాలని గ్రామస్తుల డిమాండ్

కూసుమంచి, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): కూసుమంచి మండలం పాలేరు పంచాయతీలో అవినీతి జరిగిందా..,? పైసలు ఇవ్వందే పనులు కావాడం లేదా..? కార్యదర్శి తప్పులు చేస్తున్నాడా..?  కార్యదర్శి పై స్థానికులు ఫిర్యాదు చేశారా..? పై అధికారులు విచారణకు ఆదేశించింది వాస్తవమేనా..? పాలేరు పంచాయతీ లో ఏం జరుగుతోంది..?  ఏది నిజం.. ? పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో  ముగ్గురు అక్కా చెల్లెళ్లకు సంబంధించిన ఇంటి, భూ పంపకాలు విషయంలో కోర్టుకు వెళ్ళారు. కోర్టు తీర్పు ప్రకారం పంపకాలు జరిగాయి.  అట్టి ఇండ్లకు  ఇంటి నెంబర్ కోసం పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నారు. పంచాయతీ రాజ్ నిబంధనలు ప్రకారం ఇంటి నెంబర్లను పంచాయతీ కార్యదర్శి ఇవ్వాల్సి ఉంది. 

లంచం డిమాండ్ చేశారా..? 

ఇంటి నెంబర్లు ఇవ్వడానికి పంచాయతీ కార్యదర్శి బాధితుల నుంచి వద్ద నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.6వేలు మొత్తం 18వేలు తీసుకుని వారికి ఇంటినంబర్ ఇచ్చి, పంచాయతీ రికార్డులలో పేరు ఎక్కించాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే వ్యవహారం ఆనోట ఈనోట విలేకరులకు తెలియడంతో పంచాయతీ కార్యదర్శిని వివరణ అడిగినట్లు తెలిసింది.. ఈ విషయంపై సరైనా సమాధానం ఇవ్వకుండా పొలిటికల్ చేసే ప్రయత్నం జరిగింది. దీంతో మీడియాలో కథనాలు ప్రచురితమైయ్యాయి. 

విచారణకు ఆదేశించిన డీపీఓ..? 

పాలేరు పంచాయతీ కార్యదర్శి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విషయంపై మీడియాలో వస్తున్న కథనాలకు స్పందించిన జిల్లా పంచాయతీ అధికారి కార్యదర్శి పై చర్యలు తీసుకున్నందుకు పూనుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి వ్యవహార శైలిపై విచారణ చేయాలని జిల్లా స్థాయి అధికారికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.. విచారణ అయిపోయేంత వరకు  కార్యదర్శిని ఆ పంచాయతీకి వెళ్లొద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఎంపీవో రాజారావు వివరణ...

ఇదే విషయంపై ఎంపీవోను మీడియా నేరుగా కలిసి వివరణ కోరగా పంచాయతీ కార్యదర్శిపై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. తప్పు చేసినట్లు రుజువు అయితే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇంతకు పంచాయతీ కార్యదర్శి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారా..? ప్రచారం జరుగుతుందా..? రాజకీయ ఉద్దేశం ఉందా..? అనే విషయంపై మండలంలో చర్చ జరుగుతోంది.. చూద్దాం ఉన్నతాధికారులు ఈ విషయంపై ఎలా రెస్పాండ్ అవుతారో..?