7 April, 2026 | 3:08 AM

బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

07-04-2026 12:40 AM

మణికొండ మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు బి. రవికాంత్ రెడ్డి 

మణికొండ, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మణికొండ డివిజన్లో 47వ ఆవిర్భావ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. మణికొండ మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు బి. రవికాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పార్టీ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సంస్థాగత బలోపేతానికి కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి. అంజన్ కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ వైస్ చైర్మన్ కొండకర్ల నరేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు సిహెచ్. ఇందిర పాల్గొన్నారు. మహిళా మోర్చా అధ్యక్షురాలు అప్పల అనిత, మాజీ కౌన్సిలర్ వందన నాగేష్, శ్వేత రవికాంత్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు చిలుకూరి బీరప్ప, మాజీ కోఆప్షన్ సభ్యుడు జొన్నాడ సిద్ధప్ప హాజరయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జి. వినోద్, ఓబీసీ మోర్చా కన్వీనర్ బి. శివ కుమార్, ఈ. నర్సింగ్ రావు, ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడు పక్కనాటి సత్యనారాయణ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మోహన్‌నగర్‌లో..

నాగోల్: కొత్తపేట డివిజన్ పరిధిలోని మోహన్‌నగర్ చౌరస్తాలో 47వ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు మంచి రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో, బీజేపీ ప్రధాన కార్యదర్శి గట్టు మహేష్ కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్ర మం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంచి రాజేష్ కుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కార్పొరేటర్ పవన్‌కుమార్ పాల్గొని కార్యకర్తలకు ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు  స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గాంధీనగర్ డివిజన్ అశోక్‌నగర్‌లో..  

ముషీరాబాద్:  ‘దేశం ప్రథమం.. ఆ తర్వా తే పార్టీ.. చివరగా మనం‘- ఇది కేవలం నినా దం కాదని, ప్రతి బీజేపీ కార్యకర్త జీవన వేదమని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ అన్నారు.  భారతీ య జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం  సందర్భంగా గాంధీనగర్‌డివిజన్ అశోక్‌నగర్‌లోని బూత్ నెంబర్ 271లో బూత్ అధ్యక్షుడు నీరజ్ గైక్వాడ్ బీజేపీ జెండా ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్  ఎ.వినయ్ కుమార్,  బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్నసాయి చంద్, శ్రీకాంత్, నర్సింగ్‌రావు, ఉమేష్, సాయి గౌడ్, శశికాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎస్ రావునగర్ డివిజన్‌లో..

కుషాయిగూడ: భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఎస్‌రావునగర్ డివిజన్‌లోని శ్రీ నగర్ కాలనీ ముఖ ద్వారం వద్ద డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దూ రి సంపత్ రావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు జి వి ఎన్ రావు, భారతీయ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఏనుగు రాజిరెడ్డి  అధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీశైలం, లక్ష్మయ్య, రామానుజాచార్యులు,

కుమార స్వామి, హెమంత్ కుమార్, ఆనంద్ రాజ్, బిక్షపతి కందకట్ల, నాగమళ్ళీశ్వర్ రెడ్డి, బాలకృష్ణ, సంతోష్, సాయి కిరణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పరాందు సూర్యదేవర, అశోక్ వి, కౌశిక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కుషాయిగూడలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు లక్ష్మణ్ గౌడ్, హరినాయక్ కే విద్యాసాగర్ బండారి అనిల్ చల్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

కిస్మత్‌పూర్‌లో..

రాజేంద్రనగర్: భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కిస్మత్ పూర్ 122వ డివిజన్ పరిధిలోని బూత్ నంబర్ 154లో సోమవారం బూత్ ప్రెసిడెం ట్ ఉదయ్ గౌడ్, నాగరాజు రెడ్డి అధ్యర్యంలో పోచమ్మ టెంపుల్ సమీపంలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహిచారు.

ఈ కార్యక్రమంలో బీజేఎంసీ బీజేపీ జనరల్ సెక్రటరీ నీరుడు పవన్ సాయి తో పాటు మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ నాయక్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నర్సింగ్ రావు, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, కిస్మత్పూర్ మాజీ ఉపసర్పంచ్ నీరుడు శేఖర్ ముదిరాజ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.