calender_icon.png 14 November, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంఘం పేరుతో దందా

14-11-2025 01:41:14 AM

  1. చట్టాలతో మాకు పనేంటి? 

పైసా కొట్టు....కుల సర్టిఫికెట్ పట్టు 

ఒక్కో సర్టిఫికెట్ కు రూ 30 నుంచి 50 వేలు 

పాల్వంచలో ఫేక్ మున్నూరుకాపు సర్టిఫికెట్ల బాగోతం

కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం

త్వరలో లోకాయుక్తకు ఫిర్యాదు?: కాంపెలి కనకేష్

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 13 (విజయక్రాంతి): అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్న కులం సర్టిఫికెట్. విద్యా ,ఉద్యో గ, సంక్షేమ పథకాల అవకాశాల్లో ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ అనుభవించేందుకు విధిగా కుల సర్టిఫికెట్లు అవసరం ఉంటుంది. అదే ఇప్పుడు అక్రమార్కులకు వరంగా మా రి కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రధానంగా మున్నూరుకాపు కులస్తులు అనేక మంది అనర్హులు దొడ్డిదారిన కులం సర్టిఫికెట్లు పొందుతున్నారు.

అడిగినంత పుచ్చుకొని రెవెన్యూ అధికారులు సర్టిఫికెట్లు జారీ చేసిన బాగోతం తాజాగా వెలుగు చూసింది.అందు కు ఆ కుల సంఘం నేతలు ప్రధాన భూమిక పోషించి రెవెన్యూ అధికారులకు అడిగినంత ముట్ట చెప్పి, శ్రీకాకుళం జిల్లా లావేరు మం డలం నుంచి వలస వచ్చిన తూర్పు కాపులు, నాగేశపొల్లకు దొడ్డి దారిన మున్నూరు కాపు కులం సర్టిఫికెట్లు పఅంటగట్టారు.

అందుకు ఒక్కొక్క సర్టిఫికెట్ రూ 30 నుంచి 50 వేలు ముట్ట చెప్పినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఆయా కులస్తులు 2014 ముందు బిసి-డి సీరియల్ నెంబర్ 30లో తూర్పు కా పు సర్టిఫికెట్ పొందేవారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2014లో జీవో నెంబర్ 3, జీవో నెంబర్ 16 ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చిన వారికి రిజర్వేషన్ కల్పించలేమని, వారిని తూర్పు కాపు రిజర్వేషన్ నుంచి తొలగిస్తూ జీవోను జారీ చేశారు.

దీంతో వారంతా అప్పటినుంచి మున్నూరు కాపు కులం సర్టిఫికెట్లకు అనేక విధాలుగా గాలం వేస్తూ వచ్చారు. చివరకు కొందరు 2024లో అప్పటి తాసిల్దార్లకు ఆమ్యామ్యాలను సమర్పించి, కుల సంఘం నేతల సిఫారసుతో తప్పుడు ధృవీకరణ పత్రాల ద్వారా ము న్నూరు కాపు సర్టిఫికెట్లు పొందినట్లు తేటతెల్లమైంది. సుమారు 20 మంది అనర్హులకు రెవెన్యూ అధికారులు మున్నూరు కాపు సర్టిఫికెట్లు జారీ చేశారు.

తప్పుడు దృవీకరణ పత్రాలు ద్వారా అనర్హులకు జారీ చేసిన కుల సర్టిఫికెట్లను రద్దు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్, పాల్వంచ తాసిల్దారులకు ఫిర్యాదు చేసి రెండు నెలలు గడిచిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు. ఇప్పటికే మున్నూరు కాపు సంఘం ఏజెన్సీ చట్టాలను అతిక్రమించి పాల్వంచ ఏజెన్సీ పరిధిలో ఎస్త్స్రన్మెంట్ పట్టా భూమిని చట్టానికి వ్యతిరేకంగా కొనుగోలు చేసి సంఘం కార్యాల యం నిర్మాణానికి పూనుకున్నట్లు ఆరోపణ లు ఎదుర్కొంటున్న సమయంలో తాజాగా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాల అంశం వెలుగులోకి రావడం విశేషం.

కులం సర్టిఫికెట్ కు వంశవృక్షం తప్పనిసరి 

కుల సర్టిఫికెట్ పొందాలంటే లబ్ధిదారుడి వంశవృక్షాన్ని, మైగ్రేషన్ సర్టిఫికెట్ ను తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. శ్రీకాకు ళం నుంచి వలస వచ్చిన తూర్పు కాపులు, నాగశపోలు కులస్తులు వాటిని సమర్పించలేరు. దీంతో వారికి మున్నూరు కాపు స ర్టిఫికెట్ జారీ చేయడం అసాధ్యం.

అందుకుగాను మున్నూరు కాపు సంఘం నాయకు లు అలాంటివేమీ లేకుండానే రూ. 30 నుం చి 50 వేలు దండుకొని అన్ని తామై వ్యవహరించి కుల సర్టిఫికెట్లు ఇప్పించినట్లు ఆరో పణలు వెలబడుతున్నాయి. తాసిల్దార్ కార్యాలయంలో పైవేరవీల జోరు సాగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో పనిచేసిన కొందరు తాసిల్దార్ లు మున్నూరు కాపు కులానికి చెందినవారు కాకున్నా సర్టిఫికెట్లు జారీ చేశారు.

చట్టాలతో పనేంటి? 

ఆర్థిక బలం, రాజకీయ బలం అండగా ఉంటే చట్టాలతో పనేంటన్నట్లుగా మున్నూ రు కాపు కుల సంఘం నేతలు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు అనర్హులకు కుల సర్టిఫికెట్లు జారీ చేయించడమే కాకుండా, 1/70 గిరిజన చట్టాన్ని సైతం తుంగలో తొక్కి ఎస్త్స్రన్మెంట్ భూమిని కొనుగోలు చేసి భవన నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ఒక గిరిజన రైతుకు జారీ చేసిన అసైన్మెంట్ పట్టాను 2017-18 లో గిరిజనేతరుడు అనుభవ దారి కాలంలోకి రావడం, అట్టి భూమిని కుల సంఘం భవనం కోసం మున్నూరు కాపు సంఘం కొనుగోలు చేయటం జరిగింది.

ఇప్పటికే పి ఓ టి అతిక్రమణ జరిగిందనీ గిరిజన సంఘాలు గ గ్గోలు పెడుతున్న, పట్టించుకోని అధికారుల కారణంగా కుల సంఘం నాయకులు ఏకం గా భవన నిర్మాణానికి పూనుకున్నారు. వాస్తవంగా పి ఓ టి చట్టం ప్రకారం గిరిజన భూ మిలో గిరిజనేతరులు రికార్డుల్లో నమోదైనట్లు వెల్లడైన మరు నిమిషంలోనే రెవెన్యూ అధికారులు అట్టి భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది.

రాజకీయ ఒత్తిడిలో, సంఘం ప్రలోభాలకు తలోగ్గిన అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చట్టాలను పరిరక్షించా ల్సిన రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం. ఈ తరు ణంలోనే మున్నూరు కాపు సర్టిఫికెట్ల బాగో తం వెలుగు చూడడం రెవెన్యూ అధికారుల పనితీరును అద్దం పడుతుంది.

తప్పుడు కులసర్టిఫికెట్ రద్దుకైలోకాయుక్తను ఆశ్రయిస్తా 

పాల్వంచ పట్టణ ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం, పాలకొండ మండలం నుంచి వలస వచ్చిన తూర్పు కాపులు, నాగశపోలు సుమారు 300కు పైగా కుటుంబాలు 40 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. 2014 కంటే ముందు బిసి - డి సీరియల్ నెంబర్ 30 లో తూర్పుకాపు కుల సర్టిఫికెట్లు పొందేవారు. 2014 తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో జీవో నెంబర్ 3, 2017 లో జీవో నెంబర్ 16 ద్వారా ఆంధ్ర ప్రాంత కులాలకు తెలంగాణలో రిజర్వేషన్ కల్పించలేమని, వారి తూర్పు కాపు రిజర్వేషన్ తొలగించడం జరిగింది.

తప్పుడు సర్టిఫికెట్లను రద్దు చేయాలని తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెండు నెలల క్రితం జిల్లా కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానా ఎలాంటి చర్యలు లేవు. సర్టిఫికెట్ రద్దుకై లోకాయుక్తను ఆశ్రయించనున్నాను. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలోని ఏడు మండలాలు ఆంధ్ర ప్రాంతంలో కలవడం జరిగింది.

ఆ ప్రాంతాల్లో తెలంగాణకు చెందిన మున్నూరు కాపు కులస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ద్వారా తాము మున్నూరు కాపులమని రాష్ట్ర విభజనలో ఆంధ్రాలో విలీనమయ్యామని, తమకు మున్నూరు కాపు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అప్పటి ప్రభుత్వం 2022లో జీవో నెంబర్ 49 ద్వారా ఆ ఏడు మండలాల్లోని మున్నూరు కాపులకు కులం సర్టిఫికెట్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు.

అదే తరహాలో రాష్ట్ర విభజన కంటే ముందు ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన తెలంగాణలో స్థిర పడ్డామని తమకు తిరిగి తూర్పుకాపు, రిజర్వేషన్ సౌకర్యం పునరుద్ధరించూసు కోవాలి. వారి కులం వదిలిపెట్టి తప్పుడుగా మున్నూరు కాపు పొందటం సరికాదన్నారు.

ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారంతా ఒక కుల సంఘం ఏర్పాటు చేసుకొని మున్నూరు కాపు సంఘం పేరు పెట్టుకుని తప్పుడు సర్టిఫికెట్లు పొందుతున్నారని తక్షణమే ఆ సంఘం గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కాంపెలి కనకేష్ పటేల్.

కలెక్టర్‌కు ఫిర్యాదు అందాయి 

పాల్వంచలో జారీ చేసిన తప్పుడు మున్నూరు కాపు కుల సర్టిఫికెట్లపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు వచ్చిందన్నారు. పట్టణానికి చెందిన కాంపల్లి కనకేష్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారని, ఈ అంశంపై కమిటీ విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటుందన్నారు.

 తాసిల్దార్ ధారా ప్రసాద్