calender_icon.png 14 November, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.4.5 కోట్ల అవినీతిపై విచారణ కమిటీ ఆరా

14-11-2025 01:33:12 AM

- విజయక్రాంతి ఎఫెక్ట్

కరీంనగర్, నవంబరు 13 (విజయ క్రాంతి): కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన 4.50 కోట్ల అవినీతిపై ఎంక్వయిరీ కమిటీ గురువారం విచారణ చేసింది. ఆ సుపత్రిలో జరిగిన అవినీతిపై విజయక్రాంతి దినపత్రిలో ప్రచురితమైన కథనాని కి స్పందన లభించింది. వైద్యా విధాన పరిషత్ నియమించిన మూడు బృందాలు గురువారం రాత్రి వరకు ఆసుపత్రిలో విచారణ నిర్వహించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో 2021 నుంచి 2024 వరకు 4.50 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎంక్వయిరీ కమిటీని వేశారు. ఎంక్వయిరీ కమిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి నివేదిక సమర్పించారు. కానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై కథనం ప్రచురితం కాగా కదలిక వచ్చింది.

విచారణ కమిటీకి ఫిర్యాదు చేసిన ఏఐఎఫ్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వైద్యాధికారులు, సిబ్బందిని విధులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి నిర్వహణ కోసం డీజిల్, పెట్రోల్ ఖర్చులు వంటి అనే విభాగాల కింద పెద్ద ఎత్తున నిధులు. దుర్వినియోగం చేశారని అన్నారు. వెంటనే అప్పటి వైద్యాధికారులు, సిబ్బందిపై దర్యాప్తుచేయాలనికోరారు.