20-02-2026 11:29:31 AM
ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): తెల్కపల్లి మండలం కార్వంగ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి(MLA Kuchukulla Rajesh Reddy) మాట్లాడుతూ పులిజాల–కార్వంగ గ్రామాల మధ్య వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. వాగు కారణంగా రైతులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న రాకపోకల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కలుగుతుందని అన్నారు.