2 June, 2026 | 1:18 AM

చేయి తడపనిదే పనికాదిక్కడ!

02-06-2026 12:00 AM

బెజ్జంకి ఎమ్మార్వో ఆపీస్‌లో అవినీతి బాగోతం 

విచ్చలవిడిగా వసూళ్లు 

తహసిల్దార్‌కు తెలిసే జరుగుతుందనే ఆరోపణలు

బెజ్జంకి, జూన్ 1: రెవెన్యూ కార్యాలయంలో పని అంటేనే పైరవీలతో కూడిన పని అనేది తెలిసిందే. పైకం వసూలు చేయకుండా పని జరగదనేది కూడా ప్రజల ఆరోపణలు నిజం అని చెప్పక తప్పదు బెజ్జెంకి తహసిల్దార్ కార్యాలయంలోనీ సిబ్బంది పని తీరు. విచ్చలవిడిగా వసూళ్లు జరుగుతున్న పట్టించుకునే అధికారులు లేరనీ ప్రజలు మండిపడుతున్నారు. సంతకం కోసం  రోజులు తరబడి తిరుగుతున్నా పని మాత్రం జరగడం లేదనీ ఓ బాధితుని ఆవేదన. అధికారుల గదుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని మరి కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ ఇదే.

భూ సమస్యలు, ఆదాయ ధ్రువీకరణ ప త్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, పాస్బుక్ సవరణలు, వారసత్వ నమోదు, వివిధ ప్రభు త్వ పథకాల కోసం ప్రజలు కార్యాలయానికి వస్తుంటారు. అయితే పనులు సకాలంలో జ రగకపోవడం, ఫైళ్లు ఒక టేబుల్ నుంచి మ రో టేబుల్కు మారుతూ ఆలస్యం కావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. మధ్యవర్తులు కార్యాలయం చుట్టూ తిరుగుతూ ‘డబ్బులు ఇస్తే పని త్వరగా పూర్తవుతుంది‘ అనే ప్రచా రం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సాధారణ ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. అధికారికం గా ఎవరూ అంగీకరించకపోయినా, చేయి త డపనిదే పని జరగదు అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని పలువురు చెబుతున్నారు.

ప్రతిరోజూ ఉదయం నుంచే కార్యాలయం వద్దకు వచ్చే ప్రజలు సాయంత్రం వరకు వేచి చూడాల్సి వస్తోందని సిబ్బంది సకలంలో రావటం లేదని వాతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, రైతులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రజలకు పారదర్శక సేవలు అందించాలనే లక్ష్యంతో  అధికారులు సిబ్బంది పని చేయాలని చెపుతున్నపట్టి  క్షేత్రస్థాయిలో వాటి అమలు ప్రశ్నార్థకంగా మారిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కార్యాలయంలో ఫిర్యాదు పెట్టెలు, సమాచార బోర్డులు ఉన్నప్పటికీ ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం లభించడం లేదని ఆరోపిస్తున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి

బెజ్జంకి తహశీల్దార్ కార్యాలయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టాలని, అవసరమైతే  ప్రత్యేక బృందంతో తనిఖీలు నిర్వహించాలని ప్రజ లు కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవా కేంద్రాలుగా ఉండాలే గానీ, ఇబ్బందుల కేంద్రాలుగా మారకూడదని వారు సూచిస్తున్నారు. 

కార్యాలయంలో..

రికార్డుకు సంబంధించిన విభాగంలో డబ్బులు తీసుకుని పని ఆలస్యంగా చేస్తున్నారని ఓ బాధితుడు ఆరోపించారు. ఇటీవల తనకు ఒక పని కోసం అడిగింతా డబ్బులు ముట్టజెప్పినట్టు తెలిసింది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్లు బాధితులు తెలిపారు. అయితే కార్యాలయంలో జ రిగే అవినీతి బాగోతం తహసిల్దార్ కు తెలుసుననని అయినప్పటికీ ఎవరిని కనీసం మందలించిన సందర్భం లేదని అందుకు ప్రజలు ఆరోపిస్తున్నారు. అవినీతిలో అందరికీ వా టా ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై తహసిల్దార్ శ్రీకాం త్‌ను వివరణ కోరగా ఉద్యోగులు డబ్బులు అడిగితే తనకు దృష్టికి తేవాలని కోరారు. ఆధారాలు చూపించిన స్పందించని అధికారి తనకేమి తెలియదన్నట్టు వివరణ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.