20 March, 2026 | 6:08 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్.. సొంత నిధులతో ‘ఆసరా’

20-03-2026 12:00 AM

20 మంది లబ్ధిదారులకు నెలకు రూ.2వేల చొప్పున పంపిణీ

శంకర్ పల్లి, మార్చి 19 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. శంకర్ పల్లి మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ భానూరు కృష్ణ తన ఉదారతను చాటుకున్నారు. ఇటీవల జరిగిన ము న్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రభుత్వ పెన్షన్లు రాని నిరుపేదలకు తన సొంత ఖర్చులతో అండగా ఉంటానని ఆయ న మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం, గురువారం ఉగాది పర్వదినాన్ని పురస్కరిం చుకుని బుల్కాపురంలో 20 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున ఆర్థి క సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భం గా కౌన్సిలర్ భానూరు కృష్ణ మాట్లాడుతూ..

వార్డు ప్రజల సంక్షేమమే తన ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. ఎన్నికల సమ యంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ పరంగా పెన్షన్లు మంజూరయ్యే వరకు, ప్రతి నెల నా సొంత నిధుల నుండి ఈ 20 మందికి రూ. 2వేల చొప్పున అందజేస్తాను‘ అని ఆయన హామీ ఇచ్చారు. వార్డులోని ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తమకు అండగా నిలిచిన కౌన్సిలర్ భానూరు కృష్ణపై వార్డు ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయాల్లో ఇచ్చిన మాట తప్పని నేతలు అరుదుగా ఉంటారని, కృష్ణ చేస్తున్న సేవలు అందరికీ ఆదర్శమని కొనియాడారు.