6 July, 2026 | 9:41 PM

Breaking News

చంద్రపురి డివిజన్‌లో సర్ కార్యక్రమంపై ఇంటింటి ప్రచారం   •   గిరిజన దర్బార్ లో గిరిజనులు అందించిన ప్రతి విన్నపాన్ని సత్వరమే పరిష్కరించాలి   •   శివంపేట గ్రామానికి నిధుల మంజూరుపై హర్షం!   •   ప్రమాద బాధిత కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ చేయూత   •   ముత్తారం ఎంపీడీవోగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   భిక్కనూరులో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన   •   ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •  

హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో ఉగాది

20-03-2026 12:00 AM

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): తెలుగు నూతన సంవత్సరం ఉగా దిని పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో గురు వారం వేడుకలు ఘనంగా జరిగాయి. హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస ప్రభు సమక్షంలో శ్రీ రాధా గోవింద, శ్రీదేవి భూదేవి సమేత నరసింహ స్వామి వారికి ప్రత్యేక అలంకారం, కళ్యాణోత్సవం, పల్లకి ఉత్సవం నిర్వహించబడ్డాయి. భక్తులు సుఖశాంతులతో తులతూ గాలని స్వామి వారికి పూజలు చేశారు. నగరంలోని అన్ని ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తు లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.