27 June, 2026 | 7:08 PM

Breaking News

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •  

కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య

03-06-2025 05:05 PM

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో దపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మునిపల్లి మండలం, గోపులారంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రమేశ్(38), అనిత(32) దంపతులు మునిపల్లి మండలం, గోపులారంలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య  పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ తన సిబ్బందితో ఘటన స్థలికి చేరుకున్నారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, కొండాపూర్ సీఐ వెంకటేష్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహలను స్వాధీనం చేసుకొని సదాశివపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.  మృతురాలి అన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తల్లిదండ్రుల మృతితో ముగ్గురు చిన్నారులు అనాధాలుగా మారారు. భార్యాభర్తల ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.