16 April, 2026 | 4:13 AM

గుండెపోటుతో నవ వరుడు మృతి

03-06-2025 04:50 PM

హైదరాబాద్: గుండెపోటుతో నవ వరుడు సాయి కిరణ్(19) మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. వివాహమైన 14 రోజులకే సాయికిరణ్ అనే యువకుడు నిన్న రాత్రి బ్యాండ్ కొట్టేందుకు వెళ్లి గుండెపోటు రావడంతో మరణించాడు. మే 21వ తేదీన అంసానిపల్లికి చెందిన యువతితో సాయి కిరణకు వివాహమైంది. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.