calender_icon.png 15 July, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందు కల్లు తాగి దంపతులకు అస్వస్థత..

14-07-2025 11:49:45 PM

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కల్లు దుకాణం నుండి తెచ్చుకున్న మందు కల్లు తాగిన దంపతులు అస్వస్థతకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా భూపాల్ మండలం మంచి గ్రామానికి చెందిన లచరామ్, సాక్రె భాయి గాజులరామారంలో ఉంటున్న వారి కూతురు వద్దకు వచ్చారు. రోజూ మందు కల్లు తాగే అలవాటు ఉండడంతో కల్లు దుకాణం నుండి కల్లు ప్యాకెట్లు తెచ్చుకొని తాగారు. కొద్దిసేపటి తర్వాత వారికి కాళ్ళు గుంజడం, నీరసంగా అనిపించడం 108 కి ఫోన్ చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఎలాంటి ప్రాణాపాయం లేదు: సీఐ గడ్డం మల్లేష్

ఇంతకుముందు తాగిన కల్లుకు, ఇప్పుడు తాగిన కల్లుకు తేడా ఉండడం వల్లనే ఇలా జరిగిందని, ఇది డ్రాయిల్స్ సింటమ్స్ అని, వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ ఓ ప్రకటనలో తెలిపారు.