calender_icon.png 15 July, 2025 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో 4,500 మెట్రిక్ టన్నుల యూరియా

15-07-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

చిలప్చేడ్(మెదక్), జూలై 14(విజయక్రాంతి):: జిల్లా వ్యాప్తంగా 4,500 మెట్రిక్ టన్నుల యూరియా ఇతర  ఎరువులు అందుబాటులో ఉంచామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టర్ చిలిపిచేడు మండలంలో విస్తృతంగా పర్యటించి ఫర్టిలైజర్ దుకాణాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ఇండెంట్ ఆధారంగా అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తుందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎరువులు పురుగు మందులు కొరత ఎక్కడ లేదన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన పక్షంలో సమస్యను పరిష్కరిస్తూ కొత్త సమస్యలు పునరావృతం. కాకుండా చర్యలు చేపట్టామన్నారు. వానాకాలంలో పంటలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగిందని తెలిపారు.