8 April, 2026 | 4:11 PM

Breaking News

ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లోని భారతీయులకు అత్యవసర హెచ్చరిక— హెల్ప్ లైన్ నంబర్లు ఇవే   •   లక్ష్మీ నగర్ ట్రాఫిక్ ను మరిపిస్తున్న మంథని   •  

ఐఎస్‌ఐ మాజీ చీఫ్‌పై కోర్టుమార్షల్

13-08-2024 12:17 AM

పాక్ గూఢచారి సంస్థ మాజీ అధిపతి హమీద్ అరెస్టు

ఇస్లామా బాద్, ఆగస్టు 12: పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ మాజీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను అరెస్టు చేసినట్టు ఆ దేశ సైన్యం సోమవారం ప్రకటించింది. ఆయనపై కోర్టుమార్షల్ నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. ఓ భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతోపాటు పదవీ విరమణ చేసి న తర్వాత అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకొన్నట్టు ప్రకటించిం ది. టాప్ సిటీ అనే ప్రైవేట్ హౌసింగ్ మేనేజ్‌మెంట్ పథకానికి సంబంధించిన కేసులో ఆయన జోక్యం చేసుకొ న్నారనే ఆరోపణలు వచ్చాయి.

ఆ స్కీం ను ప్రారంభించిన సంస్థ కార్యాలయాల్లో 2017 మేలో హమీద్ తన బలగంతో అక్రమంగా సోదాలు నిర్వహించారు. కంపెనీకి చెందిన బంగా రం, వజ్రాలు తీసుకెళ్లారని ఆ సంస్థ యజమానులు కోర్టులో కేసు వేశారు. హమీద్‌పై తీవ్రమైన ఆరోపణలు రావటంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో సైన్యం దర్యాప్తు ప్రారంభించింది. ఫైజ్ హమీ ద్ 2022లో సైన్యాధ్య పదవి రేసులో ఉన్నారు. అయితే అనూహ్యంగా ఆయ న రిటైర్‌మెంట్‌కు నాలుగు నెలల ముందుగానే రాజీనామా చేశారు.