30 June, 2026 | 2:39 PM

మాతమ్మ దేవాలయ 25వ వార్షికోత్సవానికి ఆహ్వానం

30-06-2026 01:59 PM

భిక్కనూర్, జూన్ 30: భిక్కనూర్ గ్రామం 14వ వార్డులోని గిద్ద హరిజనవాడ మాతమ్మ దేవి ఆలయం 25వ వార్షికోత్సవం సందర్భంగా జూలై 3న నిర్వహించనున్న ఆలయ పునర్నిర్మాణం, నల్లరాతి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అలాగే గాంధీభవన్‌లో టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను కలిసి గౌరవ అతిథిగా హాజరుకావాలని కోరారు. కౌసల్యా దేవి ఫౌండేషన్ (KDF) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భిక్కనూర్ 14వ వార్డు సభ్యుడు పెద్దబచ్చగారి జ్ఞాన ప్రకాష్ రెడ్డి, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పొట్టిగిని శంకర్, కాంగ్రెస్ నాయకుడు డప్పు రవి కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.